Sharmila: YSRCP కుట్రలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు 6 d ago

featured-image

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్ర ఆరోపనులు చేశారు. వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారిని బెదిరించి, భయపెట్టి రిపోర్ట్ రాయించారని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారించే అధికారులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారని గుర్తు చేశారు. అలాగే సునీతను కూడా చంపరని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. బెయిల్ పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న ఇటువంటి వారు బయట ఉండాలా? జైల్లో ఉండాలా అని ఆమె ధ్వజమెత్తారు.

శుక్ర వారం విజయవాడలోని పార్టీ కార్యా లయంలో షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. 'వివేకా హత్య జరిగిన సమయంలో సునీత, ఆమె భర్త అనిల్ కుమార్ అక్కడ లేరు.. అవినాష్ రెడ్డి ఉన్నారు. రక్తపు మరకలు కనిపించకుండా వాటిని తుడిపించారని, అలాంటివన్నీ ఆయనే చేయించారని అన్ని సాక్ష్యాలూ కూడా ఉన్నాయి. అయినాసరే న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం కోసం కొట్లాడా తప్పు చేయలేదని రిపోర్ట్ రాయిస్తున్నారు. అంతేకాదు.. సునీతకు ఆరోజే చెప్పాను.. ఆమె పక్షాన నిలబడతానని హామీ ఇచ్చాను. ఇందుకోసం ఎదుర్కొనేది ఎంత పెద్ద వాళ్లయినా, నా తోబుట్టువని తెలిసినా కూడా నిలబ డ్డాను' అని షర్మిల వెల్లడించారు.

'ప్రవీణ్ పగడాల ఘటనలో YSRCP రాజకీయాలు చేస్తోంది. ఈ ఘటన పై పోలీసులు వీడియోలు బయట పెడుతున్నారు. ప్రవీణ్ కుటుంబసభ్యులు సైతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. మతాల మధ్య విభజన తేవాలని BJP చూస్తోంది. BJP పార్టీ కుట్ర ఇందులో ఉందని నాకు అనిపిస్తోంది. ప్రవీణ్ పగడాలది హత్య అని ఆధారాలు దొరికితే వారి పక్షాన డీజీపీని కలుస్తా' అని షర్మిల స్పష్టం చేశారు. 'వక్స్ బిల్లు పేరుతో BJP పార్లమెంట్ వేదికగా మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బిల్లుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ లు సమాధానం చెప్పాలి. వక్స్ బోర్డు అధికారాలు ప్రత్యేక అధికారికి ఇవ్వడం ఏంటి? బోర్డులో ముస్లిమేతరులను డబ్బు కోసమే వైస్సార్సీపీ లోకి శైలజానాథ్! పెట్టడం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.

నేను కనిపించడం లేదన్నది అవాస్తవం. మెడికల్ లీవ్ అనుకోవచ్చు కదా! శైలజానాథ్ ఏముందని వైస్సార్సీపీ లోకి వెళ్లారో తెలియదు. అక్కడ అధికారం లేదు.. కానీ, డబ్బు మాత్రమే ఉంది. అయితే, ఆ డబ్బు కోసమే వెళ్లి ఉండొచ్చు. YSRCP ఫోకస్ పెట్టింది అంటే కాంగ్రెస్ బలోపేతం అయిందని అర్ధం. మా నేతల్ని లాగుతున్నారంటే.. మాకు భయపడుతున్నారు. నా కృషి ఫలించిందని అర్ధం అని షర్మిల వెల్లడించారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD